మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

 

Dashavatara Stotram – దశావతార స్తోత్రం


దేవో నశ్శుభమాతనోతు దశధా నిర్వర్తయన్భూమికాం
రంగే ధామని లబ్ధనిర్భరరసైరధ్యక్షితో భావుకైః |
యద్భావేషు పృథగ్విధేష్వనుగుణాన్భావాన్స్వయం బిభ్రతీ
యద్ధర్మైరిహ ధర్మిణీ విహరతే నానాకృతిర్నాయికా || 1 ||

నిర్మగ్నశ్రుతిజాలమార్గణదశాదత్తక్షణైర్వీక్షణై-
రన్తస్తన్వదివారవిన్దగహనాన్యౌదన్వతీనామపాం |
నిష్ప్రత్యూహతరంగరింఖణమిథః ప్రత్యూఢపాథశ్ఛటా-
డోలారోహసదోహళం భగవతో మాత్స్యం వపుః పాతు నః || 2 ||

అవ్యాసుర్భువనత్రయీమనిభృతం కండూయనైరద్రిణా
నిద్రాణస్య పరస్య కూర్మవపుషో నిశ్వాసవాతోర్మయః |
యద్విక్షేపణసంస్కృతోదధిపయః ప్రేంఖోళపర్యంకికా-
నిత్యారోహణనిర్వృతో విహరతే దేవస్సహైవ శ్రియా || 3 ||

గోపాయేదనిశం జగన్తి కుహనాపోత్రీ పవిత్రీకృత-
బ్రహ్మాండప్రళయోర్మిఘోషగురుభిర్ఘోణారవైర్ఘుర్ఘురైః |
యద్దంష్ట్రాంకురకోటిగాఢఘటనానిష్కమ్పనిత్యస్థితి-
ర్బ్రహ్మస్తమ్బమసౌదసౌ భగవతీముస్తేవవిశ్వంభరా || 4 ||

ప్రత్యాదిష్టపురాతనప్రహరణగ్రామఃక్షణం పాణిజై-
రవ్యాత్త్రీణి జగన్త్యకుంఠమహిమా వైకుంఠకంఠీరవః |
యత్ప్రాదుర్భవనాదవన్ధ్యజఠరాయాదృచ్ఛికాద్వేధసాం-
యా కాచిత్సహసా మహాసురగృహస్థూణాపితామహ్యభృత్ || 5 ||

వ్రీడావిద్ధవదాన్యదానవయశోనాసీరధాటీభట-
స్త్రైయక్షం మకుటం పునన్నవతు నస్త్రైవిక్రమో విక్రమః |
యత్ప్రస్తావసముచ్ఛ్రితధ్వజపటీవృత్తాన్తసిద్ధాన్తిభి-
స్స్రోతోభిస్సురసిన్ధురష్టసుదిశాసౌధేషు దోధూయతే || 6 ||

క్రోధాగ్నిం జమదగ్నిపీడనభవం సన్తర్పయిష్యన్ క్రమా-
దక్షత్రామిహ సన్తతక్ష య ఇమాం త్రిస్సప్తకృత్వః క్షితిమ్ |
దత్వా కర్మణి దక్షిణాం క్వచన తామాస్కన్ద్య సిన్ధుం వస-
న్నబ్రహ్మణ్యమపాకరోతు భగవానాబ్రహ్మకీటం మునిః || 7 ||

పారావారపయోవిశోషణకలాపారీణకాలానల-
జ్వాలాజాలవిహారహారివిశిఖవ్యాపారఘోరక్రమః |
సర్వావస్థసకృత్ప్రపన్నజనతాసంరక్షణైకవ్రతీ
ధర్మో విగ్రహవానధర్మవిరతిం ధన్వీ సతన్వీతు నః || 8 ||

ఫక్కత్కౌరవపట్టణప్రభృతయః ప్రాస్తప్రలంబాదయ-
స్తాలాంకాస్యతథావిధా విహృతయస్తన్వన్తు భద్రాణి నః |
క్షీరం శర్కరయేవ యాభిరపృథగ్భూతాః ప్రభూతైర్గుణై-
రాకౌమారకమస్వదన్తజగతే కృష్ణస్య తాః కేళయః || 9 ||

నాథాయైవ నమః పదం భవతు నశ్చిత్రైశ్చరిత్రక్రమై-
ర్భూయోభిర్భువనాన్యమూనికుహనాగోపాయ గోపాయతే |
కాళిన్దీరసికాయకాళియఫణిస్ఫారస్ఫటావాటికా-
రంగోత్సంగవిశంకచంక్రమధురాపర్యాయ చర్యాయతే || 10 ||

భావిన్యా దశయాభవన్నిహ భవధ్వంసాయ నః కల్పతాం
కల్కీ విష్ణుయశస్సుతః కలికథాకాలుష్యకూలంకషః |
నిశ్శేషక్షతకణ్టకే క్షితితలే ధారాజలౌఘైర్ధ్రువం
ధర్మం కార్తయుగం ప్రరోహయతి యన్నిస్త్రింశధారాధరః || 11 ||

ఇచ్ఛామీన విహారకచ్ఛప మహాపోత్రిన్ యదృచ్ఛాహరే
రక్షావామన రోషరామ కరుణాకాకుత్స్థ హేలాహలిన్ |
క్రీడావల్లవ కల్కివాహన దశాకల్కిన్నితి ప్రత్యహం
జల్పంతః పురుషాః పునన్తు భువనం పుణ్యౌఘపణ్యాపణాః || 12 ||

విద్యోదన్వతి వేంకటేశ్వరకవౌ జాతం జగన్మంగళం
దేవేశస్యదశావతారవిషయం స్తోత్రం వివక్షేత యః |
వక్త్రే తస్య సరస్వతీ బహుముఖీ భక్తిః పరా మానసే
శుద్ధిః కాపి తనౌ దిశాసు దశసు ఖ్యాతిశ్శుభా జృమ్భతే || 13 ||

ఇతి కవితార్కికసింహస్య సర్వతన్త్రస్వతన్త్రస్య శ్రీమద్వేంకటనాథస్య వేదాన్తాచార్యస్య కృతిషు దశావతారస్తోత్రమ్ |


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.